Delhi Floods: ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు పారుతుండటంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ఢిల్లీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో యమునా నది తీవ్రరూపం దాల్చింది. యమునా నది అత్యధికంగా 207.55 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో వరద ముప్పు పొంచి ఉండడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్‌లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1978లో యమునా నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. అయితే ఇప్పుడు అత్యధికంగా 207.55 మీటర్లకు చేరుకుంది. ఉదయం 11 గంటలకు నీటి మట్టం 207.48 మీటర్లకు చేరుకోగా, ఆ తర్వాత వేగంగా 207.55 మీటర్లకు పెరిగింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ అధికార యంత్రాంగం అలెర్ట్ అయింది. ఢిల్లీ పోలీసు అధికారులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందుజాగ్రత్తగా ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Read More: SSC CGL: ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష రాస్తున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..!