Site icon HashtagU Telugu

Heatwave Alert: ప్రజలకు బ్యాడ్ న్యూస్.. రాబోయే వారం రోజులపాటు వేడి గాలులే..!

Heatwave

Heatwave

Heatwave Alert: రాజధాని ఢిల్లీతో పాటు మొత్తం ఉత్తర భారతదేశంలోని ప్రజలను వేడిగాలులు (Heatwave Alert) మరోసారి ఇబ్బంది పెట్టబోతున్నాయి. జూన్ 10న రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే 6 రోజుల పాటు మొత్తం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వేడి గాలులు ఉండే అవకాశం ఉంది. హీట్ వేవ్‌కు సంబంధించి డిపార్ట్‌మెంట్ రాబోయే రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్, 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఉత్తర భారతదేశంలోని చాలా నగరాల్లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 41 నుండి 46 డిగ్రీల మధ్య నమోదైంది. హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్‌తక్‌లలో గరిష్ట ఉష్ణోగ్రత 43 నుండి 44 డిగ్రీల మధ్య నమోదైంది. పంజాబ్‌లోని అమృత్‌సర్, లూథియానా, పాటియాలాలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 42 నుండి 43 డిగ్రీల మధ్య నమోదైంది. రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత రిడ్జ్‌లో 44.6 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గరిష్టంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వారణాసి, కాన్పూర్, హమీర్‌పూర్‌లలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

Also Read: Papaya Leaf : బొప్పాయి ఆకు రసంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

రాజధాని ఢిల్లీలో గత వారం గరిష్ట ఉష్ణోగ్రత 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉండగా.. ఈ వారం 44 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా 30 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటుంది. ఢిల్లీలో మరో 6 రోజుల పాటు వేడిగాలులు కొనసాగుతాయిని ఐఎండీ పేర్కొంది.

ఈ రాష్ట్రాల్లో వర్ష హెచ్చరిక

వాతావరణ శాఖ ప్రకారం.. బెంగాల్‌లోని కూచ్ బెహార్, అలీపుర్‌దువార్, సిక్కింలోని హిమాలయ ప్రాంతాలలో 10 నుండి 25 సెం.మీ వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కర్ణాటక తీర ప్రాంతాల్లో కూడా 7 నుంచి 12 సెం.మీ. వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ 10, 11 తేదీల్లో ఉత్తర కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా మధ్య మహారాష్ట్రలో కూడా 64 నుంచి 115 మి.లీ. వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఈశాన్య ప్రాంతాలైన అస్సాం, మేఘాలయలో జూన్ 11-14 మధ్య 64 నుండి 115 మి.లీ. వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

We’re now on WhatsApp : Click to Join