Site icon HashtagU Telugu

Professor Arrested: జ్ఞానవాపిపై సోషల్ మీడియా పోస్టు.. ప్రొఫెసర్ అరెస్ట్!

Ratan

Ratan I

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో శివలింగం కనిపించిన వార్తలను ప్రశ్నించే విధంగా ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రొఫెసర్ ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు రతన్ లాన్ అనే అసోసియేట్ ప్రొఫెస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. మతప్రాదికతన సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తుడన్న ఆరోపణలు ఉండటంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిస్టర్ లాల్ ఈ మధ్య శివలింగంపై అవమానకరమైన, రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేశారని న్యాయవాది వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా సున్నితమైన సమస్య అని కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయంపై ట్వీట్ చేశారు. భారత్ లో మీరు ఏదైనా మాట్లాడితే…మరొకరి సెంటిమెంట్ దెబ్బతింటుంది. ఇది కొత్తేమీ కాదు. చరిత్రకారులను అడగడంతోపాటు అనేక పరిశీలనలను చేశాను . వాటినే రాశాను. నేను చేసిన పోస్టులో చక్కటి భాషను ఉపయోగించాను. తప్పు అనుకోవడం లేదని ప్రొఫెసర్ సమర్ధించుకున్నాడు.

జ్ఞాన్‌వాపి మసీదుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అరెస్టయిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50,000 బాండ్‌ను అందించిన తర్వాత ప్రొఫెసర్ బెయిల్‌పై బయటకు వెళ్లవచ్చు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో దొరికిన ‘శివలింగం’ గురించి ప్రొఫెసర్ రతన్ లాల్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మే 21, శనివారం తీస్ హజారీ కోర్టులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సిద్ధార్థ మాలిక్ ఎదుట హాజరుపరిచారు. తనకు బెయిల్, రక్షణ కల్పించాలని కోరుతూ ప్రొఫెసర్ లాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరయ్యింది.

Exit mobile version