Site icon HashtagU Telugu

Delhi : ఢిల్లీలో భారీ వ‌ర్షాలు.. రేప‌టి వ‌ర‌కు స్కూల్స్ బంద్‌

Schools

Schools

యమునా నది సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూలై 17, 18 తేదీలలో మూసివేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. వరద ప్రభావిత పాఠశాలలన్నీ ఆన్‌లైన్ తరగతులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని యమునా నది ఉప్పోంగుతుంది. దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల నుండి వేలాది మందిని అధికారులు ఖాళీ చేయించారు. యమునా నది సరిహద్దు ప్రాంతాలలోని పాఠశాలల్లో వరద సహాయక శిబిరాలు కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు నేడు, రేపు మూసివేస్తున్న‌ట్లు సర్కూల‌ర్ జారీ చేశారు. బుధవారం నుంచి అన్ని జిల్లాల్లో పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని డీఈవో తెలిపారు.యమునా నది నీటిమట్టం ఆదివారం రాత్రి 8 గంటలకు 208.66 మీటర్ల గరిష్ట స్థాయి నుంచి 205.98 మీటర్లుగా నమోదైంది.