Delhi Reports Monkeypox: భార‌త్ ను వ‌ణికిస్తోన్న మంకీ ఫాక్స్

చాప‌కింద నీరులా మంకీ ఫాక్స్ భార‌త‌దేశంలో విస్త‌రిస్తోంది.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 02:35 PM IST

చాప‌కింద నీరులా మంకీ ఫాక్స్ భార‌త‌దేశంలో విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంకీపాక్స్ కేసులు న‌మోదు కావ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. కేరళ నుండి 5 , ఢిల్లీ నుండి 4 కేసులు న‌మోదు కావ‌డంతో ఐసోలేష‌న్ గ‌దుల‌ను సిద్ధం చేయ‌డానికి భార‌త ఆస్ప‌త్రులు సిద్ధం అయ్యాయి. “మంకీపాక్స్ రోగుల చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, RML ఆసుపత్రి , లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాయి” అని అధికారికంగా వెల్ల‌డించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ గదుల తయారీపై ఢిల్లీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రిలో 20 ఐసోలేషన్ గదులు, గురు తేగ్ బహదూర్ ఆసుపత్రి (జిటిబి) ఆసుపత్రిలో 10 మరియు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో 10 ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేయబడ్డాయి.

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పౌరులు భయాందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవగాహన ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వం తరపున NITI ఆయోగ్ సభ్యుని అధ్యక్షతన ఒక టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. “ఇప్పటి వరకు ICMR NIV పూణే మరియు VRDL వద్ద 2 ఆగస్టు 2022 నాటికి సుమారు 100 కేసుల నమూనాలను పరీక్షించాయని కేంద్రం చెబుతోంది. దేశవ్యాప్తంగా 15 లేబొరేటరీల నెట్‌వర్క్‌లు పరీక్షించడం ప్రారంభించాయి. “ICMR-NIV పూణేతో రోగనిర్ధారణ పరీక్షను చేపట్టేందుకు శిక్షణ పొందిన పదిహేను వైరస్ పరిశోధన మరియు రోగనిర్ధారణ ప్రయోగశాలలు (VRDLలు) ఉన్నాయి.