Site icon HashtagU Telugu

Delhi Rains: ఢిల్లీలో విషాదం మిగిల్చిన వర్షాలు.. ఇద్దరు చిన్నారులు మృతి

Delhi Rains

Delhi Rains

Delhi Rains: ఢిల్లీలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది. గత కొద్దిరోజులుగా ఢిల్లీ ప్రజలను ఎండలు వెంటాడగా, ఇప్పుడు వర్షాలు తీరని బాధని మిగిలిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నై. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 88 ఏళ్ళ రికార్డ్ బద్దలు కొడుతూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. విషాదం ఏంటంటే ఈ భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

ఢిల్లీలో వర్షం కారణంగా నీటమునిగిన సిరాస్‌పూర్‌ అండర్‌పాస్‌లో స్నానం చేస్తుండగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. చిన్నారులు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నీళ్లలో విద్యుదాఘాతానికి గురై చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన ఇద్దరి పిల్లల వయస్సు 11 నుంచి 12 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Also Read: Polavaram Project : పోలవరం రివర్స్ టెండరింగ్.. 68,000 కోట్లు నష్టం..!