Site icon HashtagU Telugu

Delhi Public School : ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. పాఠశాలను ఖాళీ చేయించిన అధికారులు

Delhi Public School

New Web Story Copy (42)

Delhi Public School: దేశ రాజధాని ఢిల్లీలోని మధుర రోడ్డులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ (Delhi Public School)కు బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. దీంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. బాంబు బెదిరింపు రావడంతో ముందు జాగ్రత్తగా పాఠశాలను ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపుతో పాఠశాల క్యాంపస్‌ను ఖాళీ చేయించారు.

పలు కోణాలలో దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. ఈ విషయమై సౌత్-ఈస్ట్ ఢిల్లీ డీసీపీ రాజేష్ దేవ్ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే క్రైమ్ బ్రాంచ్ బాంబ్ డిస్పోజల్ టీమ్, స్థానిక పోలీసులను రంగంలోకి దించామని తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Read More: Mukesh Ambani: ముఖేష్ అంబానీ పెద్ద మనసు.. ఉద్యోగికి రూ.1500 కోట్ల ఇల్లు గిఫ్ట్..!

సమాచారం మేరకు డీపీఎస్ మధుర రోడ్డులో బాంబు కాల్ రావడంతో కలకలం రేగింది. బాంబు బెదిరింపు గురించి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. బుధవారం ఉదయం 8:10 గంటలకు స్కూల్‌లో బాంబు ఉందని పిసిఆర్ కాల్ ద్వారా పాఠశాల నిర్వాహకులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసు బృందం ఘటనా స్థలానికి బయలుదేరింది.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఢిల్లీలోని పాఠశాలలో ఇటువంటి సంఘటన జరిగింది. అంతకుముందు ఏప్రిల్ 12న ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలోని ఇండియన్ స్కూల్‌లో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో హడావుడిగా తల్లిదండ్రులను పిలిపించి పిల్లలను ఇంటికి పంపించారు. సమాచారం అందుకున్న బాంబు నిర్వీర్య స్క్వాడ్ పాఠశాల లోపలికి చేరుకుని, పాఠశాల ఆవరణలో 2 గంటలకు పైగా పూర్తి సోదాలు నిర్వహించగా, అక్కడ బాంబు దొరకలేదు. దీనికి సంబంధించి ఓ స్కూల్ టీచర్ మాట్లాడుతూ.. కొందరు అల్లరి పిల్లలే ఈ చర్యకు పాల్పడి ఉంటారని చెప్పారు.