Site icon HashtagU Telugu

Wrestlers Protest: ఢిల్లీ నిరసనల నేపథ్యంలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ రద్దు

Wrestlers Issue

Wrestlers Issue

Wrestlers Protest: గత రెండు నెలలుగా మల్లయోధుల పోరాటం సాగుతుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నారు రెజ్లర్లు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు రెండు నెలలుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 28న కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా జంతర్ మంతర్ వద్ద అల్లర్లు సృష్టించినందుకు రెజ్లర్లు సహా 109 మంది నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా గురువారం ఆ కేసును ఉపసంహరించుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ పోలీసులు రద్దు చేశారు. ఒకటి రెండు రోజుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయనున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ తో సహా ఇతరులను జంతర్ మంతర్ నుండి అదుపులోకి తీసుకున్న మొత్తం 109 మందితో సహా నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళనకారులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగిని చట్టబద్ధమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం, ప్రభుత్వోద్యోగి యొక్క చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించడం, ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం మరియు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్ సమీపంలో మహిళా మహాపంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు ప్రకటించారు. దీనికి పోలీసులు అనుమతించలేదు. దీంతో నిరసనకారులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ హౌస్ వైపు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈ కేసులో జంతర్ మంతర్‌లో 109 మంది మగ, మహిళా రెజ్లర్లను, వారి మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నలుమూలల నుంచి దాదాపు 800 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. రెజ్లర్లను లైంగికంగా వేధించినందుకు గానూ ఈ కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రూస్ అవెన్యూ కోర్టులో సుమారు 1000 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు.

Read More: Pawan Kalyan: వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతుందా..? ప‌వ‌న్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం..

Exit mobile version