Site icon HashtagU Telugu

Delhi New CM: ఢిల్లీ న‌యా సీఎం రేఖా గుప్తా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Delhi Politics

Delhi Politics

Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 6న వెల్లడయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ కొత్త సీఎంగా (Delhi New CM) రేఖా గుప్తాను బీజేపీ ప్రకటించింది. రేఖా గుప్తా నికర విలువ, ఆస్తుల గురించి మ‌నం తెలుసుకుందాం.

చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఢిల్లీకి ఇప్పుడు కొత్త సీఎం దొరికారు. దాదాపు 11 రోజుల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు. రేఖా గుప్తా పేరు ప్రకటించిన వెంటనే రాజకీయంగా చర్చలు జోరందుకున్నాయి. రేఖ గుప్తా షాలిమార్ బాగ్ అసెంబ్లీ నుంచి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఇది మాత్రమే కాదు.. రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, మహిళా మోర్చా అధ్యక్షురాలు కూడా.

Also Read: World Day of Social Justice : ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి..?

వివిధ కంపెనీలలో పెట్టుబడి

50 ఏళ్ల రేఖా గుప్తా 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గర్ గ్రామంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రేఖా గుప్తా మొత్తం ఆస్తులు రూ. 5.3 కోట్లు, అందులో అప్పులు రూ. 1.2 కోట్లు ఉన్నాయి. ఎల్‌ఎల్‌బీ కూడా చేశారు. రేఖా గుప్తా తన బ్యాంకు ఖాతాలో రూ.72.94 లక్షలు డిపాజిట్ చేశారు. ఎల్‌ఐసీలో రూ.53 లక్షలు పెట్టుబడి కూడా పెట్టారు. వివిధ కంపెనీల్లో షేర్లు కూడా కొన్నారు.

224 గ్రాముల ఆభరణాలు

మొత్తం రూ.9.29 లక్షలకు పైగా షేర్లలో ఇన్వెస్ట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు మీద కారు లేదు. వాస్తవానికి ఆమె భర్త పేరు మీద మారుతి ఎక్స్‌ఎల్6 కారు ఉంది. దీని ధర రూ.4,33,500. ఆమె వద్ద 224 గ్రాముల నగలు ఉన్నాయి. కాగా ఆమె భర్త వద్ద 135 గ్రాముల బంగారం ఉంది. వాటి విలువ రూ.11 లక్షలు. మొత్తం చరాస్తుల గురించి చెప్పాలంటే.. రేఖా గుప్తా వద్ద రూ.2 కోట్ల 72 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. రేఖా గుప్తా స్థిరాస్తి గురించి మాట్లాడుకుంటే.. రోహిణి, షాలిమార్‌లలో ఆమెకు ఒక్కొక్కటి ఉంది. ఇది కాకుండా ఢిల్లీలోని రోహిణిలో ఆమె భర్త పేరు మీద ఇల్లు కూడా ఉంది.

Exit mobile version