Site icon HashtagU Telugu

Corona: నోయిడాలోని పాఠ‌శాల‌లో క‌రోనా క‌ల‌క‌లం.. స్కూల్ మూసివేత‌

Corona Imresizer

Corona Imresizer

నోయిడాలోని ఖైతాన్ ప‌బ్లిక్ స్కూల్ లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. స్కూల్ లోని 13 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో స్కూల్‌ని మూసివేయాల‌ని యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. 6వ తరగతి, 8వ తరగతిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోని రెండు ప్రైవేట్ పాఠశాలల్లో ముగ్గురు విద్యార్థులకు కోవిడ్‌కు పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవతోష్ శంఖ్ధర్ మాట్లాడుతూ ముగ్గురు విద్యార్థులలో ఇద్దరు ఒకే పాఠశాలకు చెందినవారని.. ఇద్దరిలో ఒకరు నోయిడాలో నివసిస్తున్నార‌ని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలో కాకుండా వారి ఇళ్లలో ఉన్నప్పుడు వారి కోవిడ్ -19 పరీక్ష ఫలితాలు తెలిశాయని తెలిపారు. వైరస్ యొక్క తాజా XE వేరియంట్‌తో పిల్లలకు నిర్ధార‌ణ కాలేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.