Site icon HashtagU Telugu

Delhi-NCR Rains: ఢిల్లీలో దంచికొడుతున్న వర్షం, భారీగా ట్రాఫిక్ జామ్

Delhi Rains Traffic Jam

Delhi Rains Traffic Jam

Delhi-NCR Rains: ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం నాటికి వర్షం ప్రారంభమైంది. నోయిడా, ఘజియాబాద్ మరియు ఢిల్లీ (delhi rains)లోని అనేక ప్రాంతాలలో నీటి ప్రవాహం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. దాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తుంది. రద్దీ సమయాల కారణంగా రోడ్లపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి. సాయంత్రం కావడంతో ప్రజలు ఎక్కువగా ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలు దేరుతున్నారు. దీంతో రోడ్లపై వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. నోయిడాలోని సెక్టార్-14లో కూడా ట్రాఫిక్ స్తంభించింది. వర్షం కురువడంతో ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. నోయిడా, ఘజియాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. (imd updates)

మంగళవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. రుతుపవనాలు రాబోతున్నాయని, అయితే అది వీచే సమయంలో కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక్కడ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కూడా ఢిల్లీకి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Also Read: Parenting Tips : చదువుతో పాటు పిల్లలకు ఈ విషయాలను తప్పకుండా నేర్పిస్తే కెరీర్‌లో లాభాలు పొందుతారు..!