Site icon HashtagU Telugu

Akasa Flight: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాసా విమానంలో ‘సెక్యూరిటీ అలర్ట్’

Akasa Flight

Akasa Flight

Akasa Flight: భద్రతా హెచ్చరికల దృష్ట్యా అకాసా ఎయిర్‌లైన్ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అందిన సమాచారం ప్రకారం విమానం QP 1719 186 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బందితో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లింది. ఈ క్రమంలో ఫ్లైట్ QP 1719 భద్రతా హెచ్చరికను అందుకుంది. దీని కారణంగా వెంటనే ముంబైకి బదులుగా అహ్మదాబాద్‌కు మళ్లించబడింది. ఉదయం 10:13 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ విషయంపై మరింత సమాచారం ఇస్తూ అకాసా ఎయిర్‌లైన్స్, ప్రయాణికులందరినీ విమానం నుండి డిబోర్డ్ చేసినట్లు, అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను ఎయిర్‌లైన్ అనుసరిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌లైన్ ప్రతినిధి మాట్లాడుతూ “అకాసాకా ఎయిర్ ఫ్లైట్ క్యూపి 1719 జూన్ 03, 2024 న ఢిల్లీ నుండి ముంబైకి 186 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ అలర్ట్ కారణంగా నిర్దేశించిన భద్రత విధానాల ప్రకారం విమానాన్ని అహ్మదాబాద్ వైపు మళ్లించామని ఆయన అన్నారు. పైలెట్ అవసరమైన అన్ని అత్యవసర విధానాలను అనుసరించాడని పేర్కొన్నారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేశామని. అకాసా అన్ని భద్రత ప్రోటోకాల్‌లను అనుసరిస్తోందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ విషయంలో ఎక్కువ సమాచారం వెల్లడించలేదు. సంబంధిత శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది.

Also Read: Wine Shops : రేపు హైదరాబాద్‌లో వైన్‌ షాపులు బంద్‌.. 144 సెక్షన్‌ అమలు