Site icon HashtagU Telugu

Delhi Health Minister : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కస్టోడియల్ రిమాండ్ పొడిగింపు

Delhi Health Minister

Delhi Health Minister

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కస్టడీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనపై విచారణ జరుగుతోంది. జైన్‌ను ఇడి అధికారులు రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఆయ‌న కస్టడీ రిమాండ్‌ను మరో ఐదు రోజులు పొడిగించాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ అభ్యర్ధనను అనుమతించి జైన్ కస్టడీ రిమాండ్‌ను మరో ఐదు రోజులు పొడిగించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల జైన్, ఆయ‌న‌ బంధువులతో సహా తెలిసిన వ్యక్తులకు చెందిన పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. 2.85 కోట్ల నగదు, 1.80 కిలోల 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. జైన్, ఆయ‌న భార్య, ఆయ‌నికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన లేదా మనీలాండరింగ్ ప్రక్రియల్లో పాల్గొన్న వారి ఆవరణలో జూన్ 6న సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ED తెలిపింది. రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు అంకుష్ జైన్, వైభవ్ జైన్, నవీన్ జైన్ మరియు సిద్ధార్థ్ జైన్, లాలా షేర్ సింగ్ జీవన్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్మన్ జిఎస్ మాథరూ, ప్రూడెన్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నడుపుతున్న యోగేష్ కుమార్‌లకు చెందిన ప్రాంగణాల్లో తామె దాడులు నిర్వహించామ‌ని ఈడీ అధికారులు తెలిపారు.