G20 Summit: మెట్రో స్టేషన్లలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు

ఢిల్లీలో మరికొద్దీ రోజుల్లో G20 సదస్సు జరగనుంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే కేంద్రబలగాల అధీనంలో తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
G20 Summit

New Web Story Copy 2023 08 27t134243.170

G20 Summit: ఢిల్లీలో మరికొద్దీ రోజుల్లో G20 సదస్సు జరగనుంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీని కేంద్రబలగాల అధీనంలో తీసుకున్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు ఈ సమిట్ లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి ముందు ఐదుకు పైగా మెట్రో స్టేషన్లలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వెలిశాయి. దీంతో పోలీస్ యంత్రంగా అలర్ట్ అయింది. దీనిపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

డిసెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సు న్యూఢిల్లీలో జరగనుంది. అయితే అత్యవసర సేవలతో కూడిన వాహనాలు మాత్రమే న్యూఢిల్లీ జిల్లా లోపలికి వెళ్లడానికి సౌకర్యం కల్పించారు. హోటళ్లు, ఆసుపత్రులు మరియు ఇతర ఎమర్జెన్సీ కోసం హౌస్ కీపింగ్, క్యాటరింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ మొదలైన వాటికి సంబంధించిన వాహనాలను ధృవీకరించిన తర్వాత లోనికి అనుమతిస్తారు.ఇదిలా ఉండగా ఢిల్లీలోని ఐదుకు పైగా మెట్రో స్టేషన్లలో ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు వెలిశాయి. దీంతో ‘సిఖ్ ఫర్ జస్టిస్’ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి అదే సంస్థ బాధ్యత వహిస్తుంది.

Also Read: Pakistan: పాకిస్థాన్‌లో టాక్సీ డ్రైవర్ దారుణ హత్య

  Last Updated: 27 Aug 2023, 01:47 PM IST