ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కామ్‌లో మరో ఇద్దర్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వినయ్ బాబు పెర్నాడ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈడీ అధికారులు మూడు రోజులుగా శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక వివరాలను రాబట్టిన అనంతరం.. ఇవాళ ఉదయం వారిని అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయానా అన్న. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇది వరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.