Animal: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం కోట్లలో?

కష్టపడితే జీవితంలో ఏ రంగంలో అయినా దూసుకుపోవచ్చు అనడానికి ఎంతో మంది ఇప్పటికే ఉదాహరణగా నిలిచిన

  • Written By:
  • Updated On - April 10, 2023 / 05:41 PM IST

కష్టపడితే జీవితంలో ఏ రంగంలో అయినా దూసుకుపోవచ్చు అనడానికి ఎంతో మంది ఇప్పటికే ఉదాహరణగా నిలిచిన విషయం తెలిసిందే. చాలామంది కష్టపడి పెద్దపెద్ద ఐఐటీలు, బీటెక్ లు ఎమ్ టెక్ లు చేసినప్పటికీ చేసే జాబులలో సరైన సాటిస్ఫాక్షన్ లేక సొంతంగా వ్యాపారం పెట్టుకుని కోట్లకు కోట్లు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వారు కూడా ఒకరు. ఢిల్లీలో ఐఐటీ రూమ్‌మేట్స్‌గా కలిసిన అమ్మాయిలు వాళ్ళ కలను సహకారం చేసుకోవడానికి నవంబర్ 2019లో పశువుల కోసం ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమాల్‌ను ప్రారంభించారు.

తరువాత బెంగళూరులోని ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ ప్రారంభమైన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. పాడి రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, పశువుల వ్యాపారం, పాడి పరిశ్రమలను మరింత లాభదాయకంగా మార్చాలనే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు ఆ ఇద్దరు అమ్మాయిలు. ప్రతి వ్యాపారంలో ఎదురైనా ఇబ్బందులు మాదిరిగానే వీరు కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ తరువాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి ఎక్కువ ఆర్డర్‌లను పొందడం ప్రారంభించారు. యానిమల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ జంతువుల సంరక్షణకు కూడా సేవలను అందిస్తుంది.

అలా 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పొందిన ఆదాయంలో సుమారు 90శాతం పశువుల వ్యాపారం నుంచి రాగా మిగిలిన 10 శాతం వైద్య ఖర్చులు, అసిస్టెడ్ రీప్రొడక్షన్, సేల్స్ కమీషన్ వంటి వాటిద్వారా వచ్చిందని తెలుస్తోంది. యానిమాల్ అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్. దానిద్వారా పశువుల అమ్మకం మాత్రమే కాకుండా కొనుగోలు కూడా చేయవచ్చు. ప్రస్తుతం యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దూసుకెళ్తున్న ఈ కంపెనీలో షాదీ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, జొమాటో వ్యవస్థాపకుడు సీఈవో దీపిందర్ గోయెల్, అంజలి బన్సాల్, మోహిత్ కుమార్, సాహిల్ బారువాతో సహా మరో 3 మంది యానిమాల్ ఏంజెల్ పెట్టుబడిదారులుగా ఉన్నారు. కాగా 2019లో ప్రారంభమైన యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ FY22లో ఆదాయం రూ. 7.4 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం ఇది రూ. 565 కోట్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని లాభాలను తప్పకుండా ఆర్జిస్తుందని భావిస్తున్నారు.