ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బయటకి వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం, ఫీజికల్ డిస్టాన్స్ పాటించడం తప్పనిసరి చేసింది లేకుంటే భారీ ఎత్తున్న జరిమానా విధించనుంది. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. రాన్నున్న పది రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ఓమిక్రాన్ వ్యాప్తిచెందే అవకాశాలు ఉండగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
India: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రద్దు

Omicron