Site icon HashtagU Telugu

Delhi Excise Policy Case: అభిషేక్ బోయిన్ పల్లి, ఆప్ ఇంఛార్జ్ విజయ్ నాయర్ ను అరెస్టు చేసిన ఈడీ..!!

Abhishek

Abhishek

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై విచారణను మరింత వేగవంతం చేసింది ఈడీ. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ వినయ్ నాయర్ తోపాటు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక బోయిన్ పల్లిని మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందు సిబిఐ వీరిని అరెస్టు చేసి విచారించిన తర్వాత జ్యుడిషియల్ కస్టడికి పంపించింది. ఈయన కంటే ముందు విజయ్ నాయర్ ను ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసింది. దక్షిణాది నుంచి ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ లాబీయింగ్ చేస్తున్నట్లు సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.