New Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కోర్టు చిక్కుల్లో ఇరుక్కున్నారు. కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో సునీతా కేజ్రీవాల్ పేరు ఉండటంపై కోర్టు సమన్లు జారీ చేసింది. బీజేపీ నేత హరీష్ ఖురానా ఫిర్యాదుపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అర్జిందర్ కౌర్ నవంబర్ 18న అరవింద్ కేజ్రీవాల్ భార్యకు సమన్లు జారీ చేశారు. సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత తన ఫిర్యాదులో ఆరోపించారు.
సునీతా కేజ్రీవాల్ కు యూపీలోని సాహిబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మరియు ఢిల్లీలోని చాందినీ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17ను ఉల్లంఘించిందని బీజేపీ నేత ఖురానా పేర్కొన్నారు . సెక్షన్ 31 ప్రకారం ఆమె శిక్షకు అర్హురాలని అన్నారు. ఈ నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.
Also Read: Mobile Addiction: స్మార్ ఫోన్ కు బానిస అవుతున్న బాల్యం, మొబైల్ అడిక్షన్ తో తీవ్ర ముప్పు!