NewsClick: న్యూస్‌క్లిక్ ఓనర్ పుర్కాయస్థకు 7 రోజుల పోలీస్ కస్టడీ

దేశంలోని జర్నలిస్టులపై కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతిపక్ష కూటమి ఇప్పటికే పలువురు జర్నలిస్టుల్ని నిషేదించింది.

NewsClick: దేశంలోని జర్నలిస్టులపై కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతిపక్ష కూటమి ఇప్పటికే పలువురు జర్నలిస్టుల్ని నిషేదించింది. తాజాగా న్యూస్‌క్లిక్ ఛానెల్ ఏకంగా ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంటుంది. ఈ నేపథ్యంలో న్యూస్‌క్లిక్ ఛానెల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు ఢిల్లీ కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. తీవ్రవాద నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి రాత్రి కోర్టు ముందు హాజరుపరిచారు.

డబ్బులు తీసుకొని చైనాకు అనుకూలంగా వార్తలను రాస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో న్యూస్‌క్లిక్ కార్యాలయం, న్యూస్ పోర్టల్‌లో పని చేస్తున్న దాదాపు 40మంది జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాలలో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆ తరువాత చీఎఫ్ ఎడిటర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. అనంతరం ఢిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయానికి పోలీసులు సీల్ వేశారు.

Also Read: BJP-BRS Game : తెర‌చాటు వ్య‌వ‌హారానికి మోడీ ముగింపు.!