Excise Policy Case: మే 12 వరకు సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 12 వరకు పొడిగించింది.

Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 12 వరకు పొడిగించింది. గురువారం జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సిసోడియాను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిందని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది రోస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. దీంతో మనీష్ సిసోడియాకు చార్జిషీటు ఈ-కాపీ ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

ఢిల్లీ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ భావిస్తుంది. ఇక తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది. అయితే ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్న వారంతా కేవలం అనుమానితులుగానే చూస్తుంది ఈడీ. కాగా ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంని కస్టడీలోకి తీసుకుని పలు కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో సిసోడియా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కాగా తన బెయిల్ పిటిషన్ పై కోర్టులో పలుమార్లు దాఖలు చేసినప్పటికీ ఈ రోజు వరకు సిసోడియాకు బెయిల్ మంజూరు కాకపోవడం కొసమెరుపు.

Read More: Pakistani Drone: పాక్ డ్రోన్‌ కూల్చివేసిన బీఎస్ఎఫ్ సిబ్బంది.. డ్రగ్స్ స్వాధీనం