Excise policy case: ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది

Excise Policy Case: ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రోజురోజుకి ఈ కేసుపై ఉత్కంఠ కొనసాగుతుంది. సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టులో విచారణ జరిగింది. అయితే కేసుకు సంబంధించి పూర్తి సమాచారం లేనందున తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు రోస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు తీర్పును వెలువరించనుంది. అయితే ఏప్రిల్ 18న ఇరుపక్షాల వాదనలు విన్న నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో భారీగా డబ్బు చేతులు మారినట్టు ఈడీ ఆరోపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించింది. ఇటీవల ఎమ్మెల్సీ కవితని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఆ విచారణపై ఎలాంటి స్పష్టత కనిపించలేదు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది. పలు విషయాలపై ప్రశ్నలు సంధించింది. అయితే ఆ విచారణపై కూడా ఎలాంటి సమాచారం లేదు.

Read More: Anushka Trolled: లావెక్కిన అనుష్క.. ఆంటీలా ఉందంటూ ట్రోల్స్!