CM Kejriwal: మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఢిల్లీ సీఎం సీబీఐ విచారణకు హాజరు నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నదని భావించి, ఢిల్లీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పలు రోడ్లపై పోలీసులు భారీగా మోహరించారు. సీబీఐ కార్యలయంతో పాటుగా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు పహారా కాస్తున్నారు .
సీబీఐ విచారణకు వెళ్లే ముందు సీఎం కేజ్రీవాల్ ( CM Kejriwal ) ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక్కసారి కూడా 100 సార్లైనా సీబీఐ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. నన్ను అరెస్ట్ చేసేందుకు బీజేపీ పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ పెద్దల మాటలను సీబీఐ తప్పక అమలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. దేశం కోసం జీవితాన్ని అయినా అర్పిస్తానని అన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇక ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.
ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతి జరిగినట్టు సీబీఐ ఆరోపిస్తుంది. అదేవిధంగా భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఈ కేసుని విచారిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత సైతం ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్ లు బయటపెడుతూ హీటెక్కిస్తున్నాడు.
Read More: Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు!