IPL 2022: ముంబై, ఢిల్లీ గత రికార్డులు ఇవే

ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి

  • Written By:
  • Publish Date - March 27, 2022 / 03:01 PM IST

ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.
ముంబై జట్టు పాత , కొత్త ఆటగాళ్ళ కలయికతో పటిష్టంగా కనిపిస్తోంది. అటు ఢిల్లీ కూడా యువ ఆటగాళ్లు , సీనియర్ ప్లేయర్స్ తో సమతూకంగా ఉంది. బలా బలాల పరంగానే కాదు గత రికార్డులు పరంగానూ ఇరు జట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. కొంచెం ముంబై దే పై చేయిగా ఉన్నా ఢిల్లీ క్యాపిటల్స్ ను తక్కువ అంచనా వేయలేం.

ఇప్పటి వరకు ఢిల్లీ-ముంబై మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరిగాయి. ముంబై 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఢిల్లీ జట్టు 14 సార్లు విజయం సాధించింది. ఇరు జట్ల గత ఐదు మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే ముంబై జట్టు పై చేయి సాధించింది. ముంబయి గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిస్తే 2021లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు ముంబైని ఓడించింది. ముంబై గెలిచిన మూడు మ్యాచ్ లలో 2020 సీజన్ లో వచ్చినవే. అయితే గత సీజన్ లో మాత్రం ఢిల్లీ ది పై చేయిగా ఉంది.
ఈ రెండు జట్ల మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 11 సార్లు గెలుపొందగా, లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఐదుసార్లు విజయం సాధించింది. మరోవైపు ఐదుసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 సార్లు లక్ష్యాన్ని ఛేదించింది.

కాగా మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో టాస్ ప్రభావం పెద్దగా ఉండబోదని అంచనా వేస్తున్నారు. బ్ర బోర్న్ స్టేడియం లో ఇరు జట్లూ ఒక్కసారి కూడా తలపడలేదు. అయితే ఈ పిచ్ పై ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా వికెట్లు సాధించారు. ఇక ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లలో ముంబై రికార్డు అంతగా బాగాలేదు. తమ తొలి మ్యాచ్ లో ముంబై చివరి సారిగా 2012 లో గెలిచింది. మొత్తం మీద ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు.