Site icon HashtagU Telugu

Delhi Capitals: గెలుపే లక్ష్యంగా ఢిల్లీ తుది జట్టు

Delhi Capitals

Delhi Capitals

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో శుక్రవారం మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ,రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో స్థానంలో ఉండగా.. అలాగే ఈ సీజన్ లో ఆడిన 6 మ్యాచుల్లో 3 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరో ప్లేస్ లో ఉంది. అలాగే రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డుల‌ విషయానికి వస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు 24 మ్యాచ్‌ల్లో ముఖాముఖి త‌ల‌ప‌డగా రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 12 మ్యాచ్‌ల్లో గెలిపొందింది.

ఇదిలాఉంటే.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జట్టులో ఇప్ప‌టికే ఆరుగురు స‌భ్య‌లు క‌రోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బుధ‌వారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జ‌ట్టు వికెట్ కీప‌ర్ టీమ్ సీఫ‌ర్ట్ కు కరోనా సోకింది. దీంతో మ్యాచ్‌కు ముందు ప్లేయర్లు అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. అందరికి నెగిటివ్‌ రావడంతో మ్యాచ్ అడ్డంకులు లేకుండా నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.ఈ క్రమంలోనే రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ కు ముందు కూడా మ‌రోసారి ఢిల్లీ ఆట‌గాళ్ల‌కి క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే ఈప‌రీక్ష‌ల్లో కూడా ఆటగాళ్లందరికి క‌రోనా నెగిటివ్‌గా తేలడంతో ఈ మ్యాచ్ ను యథావిధిగా నిర్వహించనున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడే ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టును పరిశీలిస్తే.. ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంబించనుండగా.. మూడో స్థానంలో రిషబ్ పంత్ మిడిలార్డర్ లో రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, లోయరార్డర్ లో సర్ఫరాజ్ ఖాన్, బ్యాటింగ్ చేయనున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ బాధ్యతలను శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్ మోయనున్నారు.