Apps: ఆండ్రాయిడ్ యూజర్స్ కి హెచ్చరిక.. వెంటనే ఈ డేంజరస్ యాప్స్ ని డిలీట్ చేయండి?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. అయితే చాలామంది స్మార్ట్

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 04:46 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. అయితే చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తెలిసి తెలియక కొన్ని రకాల యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. యాప్స్ వల్ల మోసపోయాము యాప్స్ వల్ల ఫోన్ సరిగా పనిచేయడం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది తెలియక పిచ్చిపిచ్చి రకాల యాప్స్ డౌన్లోడ్ చేస్తూ వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి వారికి తాజాగా ఒక షాకింగ్ న్యూస్.

స్మార్ట్ ఫోన్ లను హ్యాక్‌ చేసి భయంకర వైరస్‌ లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్ల పై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్‌ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన స్పిన్ ఓకే అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే అన్నమాట.

రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్‌ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. అంతే కాకుండా ఇకపై అటువంటి యాప్‌లను గుర్తించి, డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు. మరి ఆ యాప్స్ ఏంటి అన్న విషయానికి వస్తే.. నాయిజ్, జాప్యా, వీఫ్లై,ఎంవీ బిట్, బియూగో, వీడియో మేకర్&వీడియో ఎడిటర్,క్రేజీ డ్రాప్, క్యాష్‌జైన్, ఫిజ్జో నావల్‌,క్యాష్ ఈఎం, టిక్ వంటి యాప్స్ ని ఉపయోగిస్తుంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు..