Site icon HashtagU Telugu

Deep Sidhu: నటుడు దీప్ సిద్దూ దుర్మరణం

Deep

Deep

పంజాబ్ నటుడు, గాయకుడు దీప్ సిద్దూ అంటే ఎవరికి తెలియకపోవచ్చమోకానీ.. వ్యవసాయ చట్టాల నిరసన సమయంలో ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన వ్యక్తి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలాంటి నటుడు హర్యానాలోని  సోనిపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చనిపోయాడు. తీవ్రంగా గాయాలపాలు కావడంతో చనిపోయాడు. స్కార్పియో వాహనం.. స్టేషనరీ తీసుకొస్తున్న ట్రక్కును ఢీ కొంది. అతనితోపాటు నటి, స్నేహితురాలు రీనా రాయ్ కూడా ఉన్నారు. ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. దీప్ సిద్దూ చనిపోగా.. రీనా రాయ్‌కు చికిత్స అందజేస్తున్నారు. సిద్దూ కుటుంబానికి పంజాబ్ సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Exit mobile version