Rajastan: కుమార్తెకు బతికుండగానే సంతాప సభ.. చివరికి?

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కూడా ఇంకా కొన్ని ప్రదేశాలలో మారుమూల గ్రామాలలో మూఢనమ్మకాలు కట్టుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని కొ

  • Written By:
  • Updated On - June 5, 2023 / 04:49 PM IST

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కూడా ఇంకా కొన్ని ప్రదేశాలలో మారుమూల గ్రామాలలో మూఢనమ్మకాలు కట్టుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని కొన్ని మూఢనమ్మకాలు కట్టుబాట్లు వింటే ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా రాజస్థాన్‌ లోని భీల్వాడాలో అటువంటి ఉందంతమే చోటుచేసుకుంది. భీల్వాడా ప్రాంతానికి చెందిన ఒక యువతి తన ప్రియునితో వెళ్లిపోయింది. దాంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక యువతి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు.

ఎట్టకేలకు ఆ యువతీని పట్టుకుని ఆమెను కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువతీ మాత్రం తన కుటుంబ సభ్యులతో మాట్లాడేది లేదని ఇంటికి కూడా తిరిగి వెళ్ళను అని తెగేసి చెప్పింది. కుమార్తె నిర్ణయం విన్న ఆ తల్లిదండ్రులు కుమార్తె విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఇక మా దృష్టిలో కుమార్తె చనిపోయిందని మేము భావిస్తున్నాము అని వారు వెల్లడించారు. కుమార్తె చనిపోయిందని శోక సందేశాన్ని కూడా ప్రచురించి కుమార్తె మరణించిన 13 రోజుల సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అంతే కాకుండా బంధువులను కూడా ఆహ్వానించారు. కాగా ఈ సంతాప సందేశం సోషల్‌ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. ఆమె ఫొటో ముద్రించిన ​కార్డు వైరల్‌ అవుతోంది. సజీవంగా ఉన్న కుమార్తె మృతి చెందిదని పేర్కొంటూ, బంధువులను దశదిన కర్మలకు ఆహ్వానించడాన్ని స్థానికులు వింతగా భావిస్తున్నారు. తమ కుమార్తె జూన్‌ 1న చనిపోయిందని పేర్కొంటూ, జూన్‌ 13న సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వైరల్‌ అవుతున్న ఈ కార్డును చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.