Site icon HashtagU Telugu

DK Aruna: ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటించండి: డీకే అరుణ

Dk Aruna

Dk Aruna

DK Aruna: గద్వాల నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. లేఖతోపాటు హైకోర్టు తీర్పు కాపీని జతపరిచింది. జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బి.కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

Also Read: Shakeela@Big Boss: నాడు పోర్న్ స్టార్.. నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్, అందరి కళ్లు షకిలపైనే!