Aadhar PAN Link: మార్చి 31 వరకే డెడ్‌లైన్… వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా!

ఆధార్, పాన్ ఇవి రెండు జీవితంలో అత్యంత ముఖ్యం. నిత్య జీవితంలో ఏదో ఒక చోట వీటి అవసరం ఉంటూనే ఉంది. నిత్య జీవితం కాదు, రోజూ అవసరం ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
1102236 Pan

1102236 Pan

Aadhar PAN Link: ఆధార్, పాన్ ఇవి రెండు జీవితంలో అత్యంత ముఖ్యం. నిత్య జీవితంలో ఏదో ఒక చోట వీటి అవసరం ఉంటూనే ఉంది. నిత్య జీవితం కాదు, రోజూ అవసరం ఉంటుంది. పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిని అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఇక దీని తుది గడువు ముగియబోతోంది.

మార్చి 31వ తేదీ సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులు రెండింటినీ తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడతాయని ఆదాయ పన్ను సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది కూడా.

మన దేశంలో అస్సాం, జమ్మూ, కాశ్మీర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాన్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలి. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండింటిని లింక్ చేసుకోండి.ఈ రెండు కార్డులను లింక్ చేయడానికి వెయ్యి రూపాయలు చెల్లించాలని గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా అధికారిక వెబ్‌సైటులోనే చేయాలి. లేదా SMS ద్వారా కూడా చేయొచ్చు.

  Last Updated: 21 Mar 2023, 08:01 PM IST