Hyderabad: జూబ్లీహిల్స్‌లోని బార్బెక్యూ బిర్యానీలో బొద్దింక

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నగరప్రజలకు హైదరాబాద్ బిర్యానీ ఓ ఎమోషన్. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్ళు ఇక్కడి బిర్యానీ రుచి చూడకుండా సిటీ దాటరంటే

Hyderabad: హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నగరప్రజలకు హైదరాబాద్ బిర్యానీ ఓ ఎమోషన్. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్ళు ఇక్కడి బిర్యానీ రుచి చూడకుండా సిటీ దాటరంటే అతిశయోక్తి కాదు. సామాన్యుల నుంచి మొదలు సెలెబ్రిటీల వరకు బిర్యానీని ఇష్టపడతారు. అంత ఇష్టంగా తినే బిర్యానీ కొన్ని చోట్ల విమర్శలను ఎదుర్కొంటుంది. కొందరు రెస్టారెంట్ నిర్వాహకులు ఇర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ బిర్యానీ విలువ పడిపోయేలా ఉంది. చికెన్, మటన్ బిర్యానీల్లో బొద్దింకలు, బల్లులు వస్తూ.. ఫుడ్ లవర్స్‌ను భయపెడుతున్నాయి. చిన్న హోటల్స్ సంగతి ఎలా ఉన్నా.. ఫేమస్ రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి.

జూబ్లీహిల్స్‌లోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో బొద్దింక వెలుగు చూసింది.తమకు వడ్డించిన బిర్యానీలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో కస్టమర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో వెయిటర్లను పిలిచిన కస్టమర్.. వారికి ఆ బొద్దింకను చూపించి సీరియస్ అయ్యాడు. కస్టమర్ వెంటనే రెస్టారెంట్ పై ఫిర్యాదు చేశాడు. ఈ తతంగాన్ని మొత్తం ఆ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫిర్యాదు మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అధికారులు రెస్టారెంట్ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. సంబంధిత సంఘటనను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు మరియు ఇతర కస్టమర్లకు బల్దియా అధికారులు హామీ ఇచ్చారు.

Also Read: Guava: జామపండు ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఆ సమస్య ఉన్నవారు తీసుకుంటే మాత్రం ప్రమాదమే?