Site icon HashtagU Telugu

Telangana : డీసీఎం వ్యాన్‌లో చెల‌రేగిన మంట‌లు.. పూర్తిగా కాలిపోయిన వ‌స్తువులు

Dcm

Dcm

దండుమల్కాపూర్‌లోని జాతీయ రహదారి-65పై వెళ్తున్న డీసీఎం వాహ‌నంలో మంట‌లు చెల‌రేగాయి, ఆన్‌లైన్ రిటైలర్ కోసం ప్యాకేజీలను తరలిస్తున్న డీసీఎం లారీ పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న డీసీఎం ట్రక్కు దండుమల్కాపూర్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. వ్యానులో మంటలు చెలరేగినట్లు గుర్తించిన డ్రైవర్ దానిని వదిలిపెట్టాడు. అత్యవసర కాల్ అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాన్ని పంపించి, మంటలను ఆర్పివేశారు. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే,ఈ ప్ర‌మాదంలో సుమారు రూ. 1 కోటి విలువైన వ‌స్తువులు పూర్తిగా కాలిపోయాయి. డీసీఎం వాహ‌నంలోని బ్యాటరీలో స్పార్క్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు.