ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. అసలే ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఐపీఎల్‌పాలకమండలి ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్‌కు 12 లక్షల ఫైన్ విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఢిల్లీ క్యాపిటల్స్ సారథికి ఈ జరిమానా పడింది. ఈ అంశంపై ఐపీఎల్ పాలక మండలి స్పందిస్తూ.. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి తప్పిదమైన కారణంగా ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. స్లో ఓవర్ రేటుకు పాల్పడినందుకు గానూ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కు 12 లక్షల ఫైన్ విధిస్తున్నాం’ అని ఐపీఎల్ తమ ప్రకటనలో పేర్కొంది.
ఇక హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో జట్టు 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం, తొలిసారి స్లో ఓవర్ రేటుకు పాల్పడితే ఆ జట్టు కెప్టెన్ కు రూ. 12 లక్షలు, అదే తప్పు మళ్ళీ చేస్తే రూ. 24 లక్షలు, మూడోసారి కూడా అదే తప్పు చేస్తే కెప్టెన్‌కు రూ. 30 లక్షల ఫైన్ తో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం విధిస్తారు..
ఇక ఇదే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ఆన్రిచ్ నోర్ట్జేకుకి ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఓవర్ మధ్యలోనే నోకియా చేతి నుంచి బంతిని తీసుకున్న ఫీల్డ్ అంపైర్.. మ్యాచ్‌లో ఇకపై బౌలింగ్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పాడు. దాంతో.. ఆ ఓవర్‌ని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేయాల్సి వచ్చింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక మ్యాచ్‌లో బౌలర్ రెండు బీమర్‌లు వేస్తే మ్యాచ్ పూర్తయ్యేవరకు ఆ బౌలర్‌కు మళ్లీ బౌలింగ్ వేయకుండా నిషేధిస్తారు. తాజాగా ఆన్రిచ్ నోర్ట్జేకు విషయంలో అంపైర్లు అదే నిర్ణయం తీసుకున్నారు.