Site icon HashtagU Telugu

Davos: ఆంధ్రాలో అదానీ పెట్టుబడులు.. జగన్ తో  ఒప్పందం!

Adani

Adani

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా అదానీ గ్రీన్‌తో రూ.60,000 కోట్ల విలువైన హైడ్రో ప్రాజెక్ట్ పై ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 3,700 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్, 10,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ లభిస్తుంది. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అదానీ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ గౌతమ్‌ అదానీ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి.  ఈ మేరకు ఎంఓయూపై రాష్ట్రం తరపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవెన్, అదానీ గ్రూప్ తరపున ఆశిష్ రాజ్‌వంశీ సంతకం చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనీసం 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో టెక్ మహీంద్రా, డస్సాల్ట్ సిస్టమ్స్ అధినేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై దృష్టి సారించి విశాఖపట్నంను టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ రంగంలో తమ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని టెక్ మహీంద్రా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సీపీ గుర్నానీ తెలిపారు.