Site icon HashtagU Telugu

YS Viveka Murder Case : వివేక హత్య కేసులో అప్రూవ‌ర్ దస్తగిరి సంచ‌ల‌న వాఖ్య‌లు.. త్వ‌ర‌లోనే నిజాలు..!

Viveka Murder

Viveka Murder Imresizer

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి.. హత్య వెనుక నిజానిజాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ అధికారులు తనకు సమన్లు ​​పంపినట్లు దస్తగిరి తెలిపారు. సీబీఐ సరైన సమాచారం సహాయంతో కేసులో ఉన్న వ్యక్తులందరినీ ప్రశ్నిస్తోంది. ఇటీవల అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారని దస్తగిరి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను సీబీఐ అధికారులు త్వరలో వెలికితీస్తారని.. ఇందులో ఎవరి పాత్ర ఉందన్న విషయాన్ని వెల్లడిస్తారని దస్తగిరి పేర్కొన్నారు. ఆ సమయంలో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటమే విచారణలో జాప్యానికి కారణమన్నారు. అయితే ప్రస్తుతం విచారణ తెలంగాణకు మారడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో అన్నీ చెబుతానని దస్తగిరి తెలిపాడు.