Site icon HashtagU Telugu

Dasoju: రేవంత్ ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా మట్లాడుతుండు : దాసోజు

Dasoju Sravan

Dasoju Sravan

Dasoju: రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా బాధ్యతారాహిత్యంతో విద్యుత్ శాఖకు చెందిన చిన్న స్థాయి ఉద్యోగులపై లేనిపోని న్యాయ విరుద్దమైన నీతిమాలిన అభాండాలు వేస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, నిర్లజ్జగా తన అసమర్ధతను కప్పి పుచ్చుకుంటున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో లేని కరెంటుకోతలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా, రేవంత్ రెడ్డి గారు, చిన్న ఉద్యోగులపై బట్ట కాల్చి మీదవేయడం తప్పు. ఏది మాట్లాడిన చలామణి అవుతుంది అంటూ రేవంత్ పై మండిపడ్డారు.

విద్యుత్ శాఖలో హెల్పర్లు, లైన్ మెన్ ఇంకా చిన్న ఉద్యోగులు స్వతహాగా పేద వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ పెద్ద అయిన రేవంత్ రెడ్డి చిన్న ఉద్యోగుల పట్ల వివక్షతో చిన్నచూపు చూడటం సామాజిక నేరం. రేవంత్ రెడ్డి తన నిరాధార అహంకార వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, చిన్న ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నానని దాసోజు డిమాండ్ చేశారు.

‘‘అయిదు నెలల్లోనే ప్రజలు జెనరేటర్స్, ఇన్వెర్టర్స్ ఎందుకు కొనుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అనేక ఇళ్లల్లో టీవీలు, ఫ్రిడ్జులు, వ్యవసాయ మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి. రేవంతరెడ్డి గారు తన పనికిరాని వాచాలతను ఇకనైనా తగ్గించుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నా. రేవంత్ ప్రభుత్వం కరెంటు విషయంలో శ్వేతపత్రం ప్రకటించాలి. ప్రస్తుతం తెలంగాణాలో అన్నిరకాల విద్యుత్ ఉత్పత్తి ఎంత? కొనుగోళ్లు ఎంత? వినియోగం ఎంత? ఇంకా అనేక వివరాలు ప్రజల ముందుంచాలి’’ అని దాసోజు అన్నారు.

Exit mobile version