Site icon HashtagU Telugu

Dasoju: తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్‌కు నోటీసులా? : దాసోజు

Dasoju Sravan

Dasoju Sravan

Dasoju: పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా పరిపాలన అద్వాన్నంగా మారిందని బీ బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు అన్నారు. గురువారం సీఎం రేవంత్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కి సంజాయిషీ  నోటీసులా?? తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా?? ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకు సంజాయిషీ నోటీసులా?? అంటూ ప్రశ్నలు సందించారు.

‘‘రేవంత్ రెడ్డి మీ ప్రతీకార రాజకీయాలను ప్రక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే మీ దుష్ప్రయత్నాలను విరమించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని మీ ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదు. హామీల అమలు చేతకాని గుంపుమెస్త్రీగా డివెర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు మీరు తెరలేపారు’’ అంటూ దాసోజు ఫైర్ అయ్యారు.