world cup 2023: డారిల్ మిచెల్ భారీ సెంచరీ

ధర్మశాల వేదికగా ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో కివీస్ జట్టు ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర

world cup 2023: ధర్మశాల వేదికగా ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో కివీస్ జట్టు ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌లు బాధ్యతగా తీసుకున్నారు. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటు స్కోర్ బోర్డును పెంచారు. ఈ క్రమంలో డారిల్ మిచెల్ 100 బంతుల్లో శతకం చేశాడు. మిచెల్ ఫోర్లు సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో ఉన్న రచిన్ రవీంద్ర 87 బంతుల్లో 75 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. టీమిండియా బౌలర్లలో షమీ పదునైన బంతులకి కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. షమీకి తోడు కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. కుల్దీప్ రెండు వికెట్లు తీసుకోగా సిరాజ్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.

టీమిండియా: రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్‌: టామ్ లాథమ్‌(కెప్టెన్‌), డేవాన్ కాన్వే, విల్ యంగ్‌, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మార్క్ చాప్‌మన్‌, మిచెల్ సాంట్నర్‌, మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గుసన్‌, ట్రెంట్ బౌల్ట్‌

Also Read: CBN : తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగ లేఖ