Anasuya Bharadwaj: అనసూయ ‘దర్జా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’.

Published By: HashtagU Telugu Desk
Darja

Darja

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి డేట్ అనౌన్స్‌మెంట్ లోగోని శనివారం, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీరశంకర్.. పాత్రికేయులు ప్రభు, వినాయకరావులు సంయుక్తంగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్ర విడుదలకు సంబంధించిన డేట్ అనౌన్స్‌మెంట్ లోగోని విడుదల చేసిన దర్శకులు వీరశంకర్‌గారికి, మీడియా సోదరులు ప్రభు, వినాయకరావులకు మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి పెద్దలు ఎందరో.. వారి సపోర్ట్‌ని అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాము. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాము. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు.

  Last Updated: 09 Jul 2022, 07:52 PM IST