Site icon HashtagU Telugu

Dog Bites Vs Temperatures : సమ్మర్ లో కుక్కకాట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ?

Dog Bites Vs Temperatures

Dog Bites Vs Temperatures : కుక్కకాటు ఘటనలు సమ్మర్ లో బాగా పెరిగిపోవడాన్ని మనం చూశాం.. 

కుక్కలు ఇలా ఎందుకు తెగబడ్డాయో అర్ధం కాక కన్ఫ్యూజ్ అయ్యాం.. 

తాజాగా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు ఒక సమాధానాన్ని దొరకబట్టారు. 

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల జాయింట్  టీమ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మనుషులను కుక్కలు కరిచిన ఘటనలకు.. ఆయా రోజుల్లో నమోదైన టెంపరేచర్స్ తో (Dog Bites Vs Temperatures)  సంబంధం ఉందని గుర్తించారు. వాతావరణ ఉష్ణోగ్రతలు, UV రేడియేషన్ లెవల్స్,  ఓజోన్ లెవల్స్ పెరిగిన రోజుల్లో కుక్క కాట్లు గణనీయంగా పెరిగాయని స్టడీలో వెల్లడైంది.  వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో, ఎండల కారణంగా భూమి బాగా వేడెక్కుతున్న రోజుల్లో కుక్కల ప్రవర్తన గతి తప్పుతోందని తేలింది.

Also read : US Dog: అతి పొడవైన నాలుకతో గిన్నిస్ రికార్డు సృష్టించిన కుక్క.. ఫోటోస్ వైరల్?

ఉష్ణోగ్రతల హీట్ ఎఫెక్ట్ తో కుక్కలతో పాటు కోతులు, ఎలుకలు కూడా వికృత ప్రవర్తన కనబరుస్తున్నాయని  పరిశోధకులు కనుగొన్నారు. ఎలుకలు పంటలు నాశనం చేయడం.. కోతులు మనుషులపై దాడులు చేయడం వంటి ఘటనలను ఆ కోవలోకే వస్తాయని స్టడీ రిపోర్ట్ లో శాస్త్రవేత్తలు ఉదహరించారు.  2009 నుంచి 2018 వరకు అమెరికాలోని ఎనిమిది నగరాల్లో నమోదైన 69,525 కుక్కకాటు కేసులు.. ఆ కేసులు నమోదైన రోజుల్లో ఉన్న టెంపరేచర్స్ ను తులనాత్మకంగా స్టడీ చేసి పై అంచనాకు వచ్చారు.