క్లాసికల్…వెస్ట్రన్ రెండు కలిసి చేసే నాట్యం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ దాన్ని ఇష్టపడేవారూ ఉన్నారు. అందుకే సంప్రదాయబద్దమైన భరత నాట్యంలో ..హిప్ హాప్ డ్యాన్స్ ను వీరు మిక్స్ చేసి అదరగొట్టే స్టెప్పులు వేశారు. ఎందుకు ఇలా చేశారన్న డౌట్ రావచ్చు. దీనికి కొత్తదనం తీసుకురావాలన్న ప్రయత్నం కోసమే అని చెబుతున్నారు.
వీరు చేస్తున్న భరత నాట్యం స్టెప్పులు చూడముచ్చటగానూ..హిప్ హాప్ సమయంలో ఊర్రూతలూగించేలా ఉంటుంది. అయినప్పటికీ వీటి మిక్సింగ్ తో పాపులారిటీ కోసం ఓ చిన్న ప్రయత్నం చేశారు. కొరియో గ్రాఫర్ ఉషాజై దీన్ని ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. మీరూ ఓ సారి చూడండి .