Australia Cricketer Retire: క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్

ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ (Dan Christian) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను T20 క్రికెట్ విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడు.

Published By: HashtagU Telugu Desk
Dan Christian

Resizeimagesize (1280 X 720) (2) 11zon

ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ (Dan Christian) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను T20 క్రికెట్ విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడు. బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న ఆటగాడు. అతను ప్రస్తుతం బిబిఎల్‌లో ఆడుతున్నాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్నాడు. 39 ఏళ్ల డాన్ క్రిస్టియన్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. క్రిస్టియన్ ట్వీట్‌లో ఇలా వ్రాశాడు.. బీబీఎల్ సీజన్ ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా. హారికేన్స్‌తో మ్యాచ్ తర్వాత ఫైనల్స్ ఆడబోతున్నా అని తెలిపాడు.

అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు. 39 ఏళ్ల డాన్ క్రిస్టియన్ తన కెరీర్‌లో 405 టీ20 మ్యాచులు ఆడి 5809 పరుగులు, 280 వికెట్లు తీశాడు. డాన్ క్రిస్టియన్ ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పూణె జెయింట్స్, ఢిల్లీ డెర్‌డెవిల్స్ తరుపున ఆడాడు. ఐపీఎల్‌లో 49 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. వీటిల్లో 460 పరుగులు చేసిన క్రిస్టియన్ 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Also Read: IND vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో సిరీస్ పట్టేస్తారా..?

గత దశాబ్దంలో డాన్ క్రిస్టియన్ ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్‌లలో క్రికెట్ ఆడాడు. కెరీర్‌లో ఎక్కువ భాగం టీ20 క్రికెట్‌పైనే దృష్టి సారించాడు. 2010 నుంచి ఇప్పటి వరకు 9 దేశవాళీ టీ20 టైటిళ్లను అందుకున్న జట్లలో మెంబర్ గా ఉన్నాడు. BBLలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ట్రోఫీని అందజేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో 405 T20 మ్యాచ్‌లు ఆడాడు. 5809 పరుగులు చేశాడు. 280 వికెట్లు తీసుకున్నాడు. డాన్ క్రిస్టియన్ 2021లో ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను 2018 సంవత్సరంలో తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున 20 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో 49 మ్యాచ్‌లు ఆడి 460 పరుగులు చేసి 38 వికెట్లు పడగొట్టాడు.

  Last Updated: 21 Jan 2023, 12:35 PM IST