Dalit Farmer: దళిత రైతును కట్టేసి కొట్టిన రెడ్డి

మంచిర్యాల జిల్లా కొత్త మండలం శెట్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దళిత రైతును అగ్రకులానికి చెందిన వ్యక్తి చెక్క కట్టేసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది.

Published By: HashtagU Telugu Desk
Dalit Farmer

New Web Story Copy 2023 08 12t205647.949

Dalit Farmer: మంచిర్యాల జిల్లా కొత్త మండలం శెట్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. దళిత రైతును అగ్రకులానికి చెందిన వ్యక్తి చెక్కకు కట్టేసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి వరి పొలంలో ఎద్దులు మేయడంతో దళిత రైతుని ఈ విధంగా శిక్షించాడు. ఈ సంఘటన ఆగస్ట్ 10 న జరిగింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కోటపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుర్గం బాపు అనే దళితుడిపై సూరం రామిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. కనికరం లేకుండా కొట్టి కుల దూషణకు దిగి చెక్క కట్టేసి చిత్ర హింసలు పెట్టాడు. కొందరు అడ్డుపడగా వారిని దోషిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కోటపల్లి పోలీసులు రామిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Gold Seized : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

  Last Updated: 12 Aug 2023, 09:00 PM IST