Dalit Bandhu: అందోల్ నియోజకవర్గంలో దళితుల బందు

సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఈరోజు దళిత బంధు ప్రారంభం మండలంలోని బద్దాయిపల్లి గ్రామం నుంచి లబ్ధిదారులకు ట్రాక్టర్లు, జేసీబీలు, బొలెరో వాహనాలను ఎమ్మెల్యే కాంతి కిరణ్‌ అందజేశారు.

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 11:00 PM IST

సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఈరోజు దళిత బంధు ప్రారంభం మండలంలోని బద్దాయిపల్లి గ్రామం నుంచి లబ్ధిదారులకు ట్రాక్టర్లు, జేసీబీలు, బొలెరో వాహనాలను ఎమ్మెల్యే కాంతి కిరణ్‌ అందజేశారు. ఈ సందర్భంగా 20 మంది లబ్ధిదారులకు డైరీకి సంబంధించిన ప్రొసీడింగ్‌లను అందజేశారు. మర్పల్లి మార్కెట్ యాడ్ వద్ద ఘనంగా జరిగిన దళిత బంధువుల వాహనాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా లబ్ధిదారులకు నచ్చిన విధంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించి ఇష్టారాజ్యంగా వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి తమ వాహనాలను మార్కెట్ కమిటీలో ఉంచి తోరణాలు కట్టి అలంకరించి పంపిణీ కార్యక్రమాన్ని వేడుకగా చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను మహిళలు, పురుషులు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ వేదికపైకి తీసుకొచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ లబ్దిదారులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొని వారికి వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ యార్డు నుంచి వట్ పల్లిలోని అంబేద్కర్ విగ్రహం వరకు జేసీబీలతో ట్రాక్టర్లు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీలు రైతు సమన్వయ సమితి నాయకులు మార్కెట్ కమిటీ నాయకులు హాజరయ్యారు.