Site icon HashtagU Telugu

Astrology : ఈ రాశివారికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది.!

Astrology

Astrology

Astrology : గురువారం రోజున చంద్రుడు మిధున రాశిలో సంచారం చేయనుండగా, కృత్తిక నక్షత్ర ప్రభావం ద్వాదశ రాశులపై కనిపించనుంది. ఇదే సమయంలో బ్రహ్మ యోగం ఏర్పడుతుంది. శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి విశేష అనుకూలతలు లభించనుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండే సూచనలున్నాయి. కెరీర్ పరంగా అభివృద్ధి అవకాశాలున్నాయి. అలాగే పెండింగ్ పనులు పూర్తి చేసే శుభయోగం ఏర్పడనుంది. మరి ఈ రోజు మేషం నుంచి మీన రాశుల వరకు ఎలాంటి ఫలితాలు చూడబోతున్నామో, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి
ఈరోజు మేష రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటారు. ప్రేమ సంబంధాలు అనుకూలంగా కొనసాగుతాయి. వ్యాపారులు కష్టపడితే మంచి లాభాలు పొందగలరు.
అదృష్ట శాతం: 91%
పరిహారం: బ్రాహ్మణులకు దానం చేయాలి.

వృషభ రాశి
ఈ రోజు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి రావొచ్చు. ఖర్చులను సరిగా నియంత్రించకపోతే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఆర్థిక పరంగా వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కాస్త శ్రమించాల్సిన అవసరం ఉంది.
అదృష్ట శాతం: 67%
పరిహారం: ఆకలితో ఉన్నవారికి ఆహారం పంపిణీ చేయాలి.

మిధున రాశి
కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. మీ మాటతీరు అందరిని ఆకట్టుకుంటుంది. కుటుంబం, వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడి చదవాలి.
అదృష్ట శాతం: 70%
పరిహారం: శివునికి తెల్లచందనం సమర్పించాలి.

కర్కాటక రాశి
ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆకస్మిక అతిథుల రాకతో ఆనందంగా గడిపే అవకాశముంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి.
అదృష్ట శాతం: 83%
పరిహారం: తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి.

సింహ రాశి
కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులు నష్టాలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
అదృష్ట శాతం: 75%
పరిహారం: శనిదేవుని దర్శించుకుని నూనె సమర్పించాలి.

కన్య రాశి
స్నేహితుల సలహా తో చెడిపోయిన పనులు పూర్తవుతాయి. పిల్లల నుంచి ఆనందం లభిస్తుంది. పనిలో అడ్డంకులను మీమే తొలగించగలుగుతారు.
అదృష్ట శాతం: 89%
పరిహారం: ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి.

తులా రాశి
ఉదయం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. రోజంతా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. సాయంత్రం వేళలో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది.
అదృష్ట శాతం: 67%
పరిహారం: శునకానికి రోటీ తినిపించాలి.

వృశ్చిక రాశి
వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థులు కృషి చేయాలి.
అదృష్ట శాతం: 95%
పరిహారం: శివునికి రాగి పాత్రలో నీరు పోసి, తెల్లచందనం సమర్పించాలి.

ధనుస్సు రాశి
దేవాలయ సందర్శన చేసేందుకు అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు.
అదృష్ట శాతం: 84%
పరిహారం: గోమాతకు బెల్లం తినిపించాలి.

మకర రాశి
వాగ్వాదాలకు దూరంగా ఉండండి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి.
అదృష్ట శాతం: 77%
పరిహారం: శ్రీ మహా విష్ణువును పూజించాలి.

కుంభ రాశి
ఉద్యోగస్తులు నిశ్శబ్దంగా పని చేయడం మంచిది. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అదృష్ట శాతం: 86%
పరిహారం: చీమలకు పిండి పదార్థాలను తినిపించాలి.

మీన రాశి
స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశముంది. రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. కుటుంబంలో శుభవాతావరణం నెలకొంటుంది.
అదృష్ట శాతం: 90%
పరిహారం: శివ చాలీసా పారాయణం చేయాలి.

(గమనిక: జ్యోతిష శాస్త్రం, మత విశ్వాసాల ఆధారంగా ఈ ఫలితాలు ఇవ్వబడినవి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)

Delhi Elections 2025 : ఢిల్లీ పీఠం ఏ పార్టీ ఎక్కువ సార్లు దక్కించుకుందో తెలుసా..?