Site icon HashtagU Telugu

D Srinivas: ఆందోళనకరంగా డీఎస్ ఆరోగ్య పరిస్థితి

D Srinivas

New Web Story Copy 2023 09 12t193615.104

D Srinivas: మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ తదితర సమస్యలతో ఆరోగ్యం మరింత క్షీణించింది. యూరిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. డీఎస్ కు గతంలో బ్రెయిన్ స్ట్రోక్ తో పాటు పక్షవాతం కూడా సోకినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ప్రముఖ దవాఖానలో చికిత్స పొందుతున్నారు ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా తాజాగా డీఎస్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. డీ శ్రీనివాస్ పరిస్థితి మరింత సీరియస్ గా ఉందని చెప్పారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆస్తమా, కిడ్నీ, బీపీ సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

Also Read: Mark Antony : హమ్మయ్య కోర్టులో సినిమాకు క్లియరెన్స్ తెచ్చుకున్న విశాల్.. మార్క్ ఆంటోనీ రిలీజ్..