Site icon HashtagU Telugu

Cyclone Michaung: మిక్‌జామ్ తుఫాను బాధితులకు రూ.6,000 పరిహారం అందజేత

Cyclone Michaung

Cyclone Michaung

Cyclone Michaung: మిక్‌జామ్ తుఫాను కారణంగా చెన్నై తీవ్రంగా నష్టపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది. ముందుగా ప్రకటించినట్లుగానే బాధిత కుటుంబాలకు 6 వేలు ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.

తమిళనాడులో మిక్‌జామ్ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలకు నేటి నుంచి 6,000 రూపాయల పరిహారం అందజేస్తున్నారు. అలాగే ఉపశమనం కోసం ఇంకా టోకెన్లు ఇవ్వని కొంతమంది సాధారణ ప్రజలకు ప్రత్యామ్నాయం చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది. తద్వారా వరద బాధిత ప్రజలకు కచ్చితంగా రూ.6000 సాయం అందిస్తామన్నారు. రూ.6,000 సాయం అందించడంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో వారికే ఇస్తామని ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read: Mallika Sagar : రేపే ఐపీఎల్ మినీ వేలం.. ఆక్షనీర్‌గా ‘మల్లిక’.. ఎవరామె ?