Site icon HashtagU Telugu

Cyclone Biparjoy : 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బైపార్జోయ్.. 4 రాష్ట్రాలపై ఎఫెక్ట్

Cyclone Biparjoy

Cyclone Biparjoy

‘బైపర్ జోయ్’ తుఫానుపై భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం తాజా అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం తూర్పు-మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉన్న ‘బైపర్ జోయ్’ తుఫాను(Cyclone Biparjoy).. తదుపరిగా  ఉత్తరం దిశకు మళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత..  వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారొచ్చని IMD అంచనా వేసింది. ఒకవేళ ఈ మార్పు సంభవిస్తే గాలి వేగం గంటకు 145 కి.మీ వరకు ఉంటుందని పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో గాలి వేగం గంటకు  160 కి.మీ వరకు పెరుగుతుందని తెలిపింది.

4 రాష్ట్రాలపై ఎఫెక్ట్..

జూన్ 11 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దని IMD సూచించింది. ప్రస్తుతం  ‘బైపర్ జోయ్’ తుఫాను(Cyclone Biparjoy) గోవాకు పశ్చిమ-నైరుతి దిశగా 900 కి.మీ దూరంలో, ముంబైకి నైరుతి దిశగా 1020 కి.మీ దూరంలో, పోర్‌బందర్‌కు నైరుతి దిశగా 1090 కి.మీ దూరంలో, కరాచీకి దక్షిణంగా 1380 కి.మీ దూరంలో ఉందని IMD వెల్లడించింది. ‘బైపర్ జోయ్’ తుఫాను  ప్రభావం ఉత్తర కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలపై  ఉండొచ్చని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ వార్నింగ్స్ జారీ చేసింది.  

మత్స్యకారులకు హెచ్చరికలు జారీ 

జూన్ 10 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని IMD హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ అరేబియా సముద్రం యొక్క మధ్య, పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొంది. ప్రత్యేకించి జూన్ 8 నుంచి 10 వరకు అలర్ట్ గా ఉండాలని తెలిపింది. జూన్ 6, 7 తేదీల్లో కేరళ-కర్ణాటక తీరాలు, లక్షద్వీప్-మాల్దీవుల ప్రాంతాల్లోని మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి. కొంకణ్-గోవా-మహారాష్ట్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు జూన్ 8 నుంచి జూన్ 10 వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

Exit mobile version