Cyclone Asani: ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు…అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే..!!

అసని తుఫాన్ అలజడి సైక్లోన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తుఫాన్ సైరన్ తో ఏపీ వణికిపోతోంది.

Published By: HashtagU Telugu Desk
Cyclone Asani

Cyclone Asani

అసని తుఫాన్ అలజడి సైక్లోన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తుఫాన్ సైరన్ తో ఏపీ వణికిపోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 410కి.మీ పూర్తీకి దక్షిణంగా 510కి.మీ దూరంలో కేంద్రీక్రుతమైన ఉంది.

అసాని తుఫాన్ భయంకరమైన రూపాన్ని చూపుతూ..ప్రజలను భయాందోళనలకు గురి చేయడం ప్రారంభించింది. తీరం వద్దకు చేరుకున్నప్పుడు…మళ్లీ ఉత్తర ఈశాన్య దిశలో మారి తుఫానుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కార్యాలయం IMD ఈ విషయాన్ని వెల్లడించింది. అసాని తూర్పు తీరం వైపు కదులుతున్నందుని దాని ప్రభావిత ప్రాంతాల్లో గంటలకు 120కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, భారీ వర్షం కూడా కురుస్తున్నాయి. వాతావరణ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం…అసాని తుఫాను ఈ రాత్రికి ఉత్తర ఆంధ్ర, ఒడిశా తీరాలకు చేరుకునే సమయానికి తుఫానుగా మారే ఛాన్స్ ఉంది.

మరోవైపు అసాని ప్రభావంతో విశాఖతోపాటు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు.

  Last Updated: 10 May 2022, 01:14 PM IST