Cryptocurrency: బ్యాంగ్ బ్యాంగ్.. క్రిప్టోకరెన్సీని కొల్ల‌గొట్టారు

  • Written By:
  • Publish Date - February 5, 2022 / 05:16 PM IST

సైబ‌ర్ కేటుగాళ్ళ క‌న్ను ఇప్పుడు క్రిప్టోకరెన్సీ పై ప‌డింది. ఇప్పుడిప్పుడు క్రిప్టోకరెన్సీ క‌రెన్సీ గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సైబ‌ర్ నేర‌గాళ్ళు క్రిప్టోకరెన్సీని కూడా దోచుకోవ‌డం ఆందోళ‌ణ క‌ల్గిస్తోంది.

అస‌లు మ్యార‌ట్‌లోకి వెళితే.. వార్మ్ హోల్ అనే సంస్థకు చెందిన వెబ్ స‌ర్వ‌ర్ల‌పై హ్యాక‌ర్లు దాడి చేసి ఏకంగా $320 మిలియ‌న్ డాల‌ర్లు విలువైను 120,000 ఎథెరియం క‌రెన్సీని కాజేశారు హ్యాక‌ర్లు. బ్లాక్‌చైన్ సాంకేతిక‌త‌తో భ‌ద్ర‌త ఉంటుంద‌ని భావించగా, త‌ర‌చూ హ్యాకింగ్‌కు గుర‌వ‌డం క్రిప్టోక‌రెన్సీ పై నీలినీడ‌లు క‌మ్ముకునే అవ‌కాశం ఉంది. క్రిప్టోకరెన్సీ అభివృద్ధిలోకి వచ్చాక జరిగిన, ఇది నాలుగో అతిపెద్ద హ్యాకింగ్ అని టెక్నాల‌జీ నిపుణులు చెబుతున్నారు.

ఇక వార్మ్ హోల్ సంస్థ అనేది వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుంది. అంటే దీనిద్వారా ఒక క్రిప్టో నెట్‌వర్క్ నుండి మరొక క్రిప్టో నెట్‌వర్క్‌కు లావాదేవీలు బదిలీ చేసుకోవచ్చు. వార్మ్‌హోల్ సంస్థ‌కు చెందిన స‌ర్వ‌ర్‌లో లోపాలు క‌నిపెట్టి హ్యాక‌ర్లు ఎథెరియం క‌రెన్సీని దోచుకున్నారు. అయితే లావా దేవీలు జ‌రిపే సంస్థ‌లకు చెందిన స‌ర్వ‌ర్ల‌లో సాంకేతిక లోపాల కార‌ణంగా హ్యాక‌ర్లా ఏంతో చాక‌చ‌క్యంగా ప్ర‌వేశించి దోచుకున్నార‌ని టెక్ విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు.